ఆషాడ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు తరలివస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. మన్యంకొండ వాస గోవిందా అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలందరూ జరుపుకోవాలని పలువురు భక్తులు ఆకాంక్షించారు.