మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లోని ఎయిమ్స్ ను గురువారం సందర్శించారు. బీబీ నగర్ ఎయిమ్స్ బోర్డు మెంబర్ గా ఉన్నానని, నియామకం అయిన తర్వాత తొలిసారి రావడం ఇదే అన్నారు. ఎయిమ్స్ లోని పలు వార్డులలో అధికారులతో కలిసి పరిశీలించారు. రోగులకు, నిరుపేదలకు అందుతున్న వైద్య సేవలు, వైద్య పరికరాలు, మౌలిక వసతులపై ఎంపీ ఆరా తీశారు. ఏక్ పేడ్ మాకే నాంపే కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటారు.