దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలం బండ్రవల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ముఖ్యఅతిథిగా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆమెకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.