హైవేపై టోల్ ఛార్జీలు పెరగడంతో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, షాద్నగర్, కొత్తకోట, పెబ్బేరు, అలంపూర్, కర్నూల్, గద్వాల్, వనపర్తి వైపు వెళ్లే బస్సులకు టిక్కెట్ ధర పెంచింది. టోలేటు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలు డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఆకస్మికంగా ఛార్జీలు పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.