రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అల్ మేవా అధ్యక్షుడు ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ 317 జీఓ కారణంగా స్థానికత కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఇంకా పుస్తకాలు పంపిణీ చేపట్టలేదని, వెంటనే పుస్తకాలు పంపిణీ చేయాలని అన్నారు.