నగర పాలిక వార్డుల విభజన శాస్త్రీయంగా చేపట్టాలని మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు గురువారం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు సరి చేయకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు నిజాలు వివరించి పోరాటం చేస్తామన్నారు. మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ గతంలో వార్డుల విభజన ప్రజలందరి ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపినట్టు చెప్పారు.