వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్

58చూసినవారు
వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వార్డులో శనివారం మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పర్యటించారు. 10వవార్డు విగ్నేశ్వర కాలనీ, 27వ వార్డు యెర్రకుంట, 19వ టీచర్స్ కాలనీ, చెరువు కట్ట పరిశీలించారు. రానున్న వర్షాకాలంలో వర్షపు నీరు నిలువకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, నాలాలు శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. పారిశుధ్యపనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్