మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని 14 వ వార్డులో శిథిలావస్థలో వర్షాలకు తడిసి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లను గుర్తించి ఆదివారం వార్డ్ కౌన్సిలర్ కోనేటి పుష్పలత నోటీసులు ఇచ్చి జాగ్రత్తగా ఉండమని సూచించారు. వర్షానికి పాడైనటువంటి రోడ్లను, మట్టి రోడ్లను, సీసీ రోడ్ల పక్కన ఉన్న ముండ్ల చెట్లను కౌన్సిలర్ కోనేటి పుష్పలత పర్యవేక్షణలో జేసీబీతో తొలగించారు.