ప్రైవేటీకరణ ఆపాలి: సీఐటీయు రాజ్ కుమార్ డిమాండ్

63చూసినవారు
ప్రైవేటీకరణ ఆపాలి: సీఐటీయు రాజ్ కుమార్ డిమాండ్
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుకరణ వెంటనే ఆపాలని సిఐటియు మహబూబ్‌నగర్ పట్టణ‌ నాయకుడు రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో డిమాండ్స్ డే ను పురస్కరించుకొని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి క్లాక్ టవర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్