మహబూబ్‌నగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు

65చూసినవారు
మహబూబ్‌నగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు
మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు దుండగులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్