
రోజుకు ఎంత వాటర్ తాగాలి?
మనిషి శరీర బరువులో 75 శాతం వరకు నీరు ఉంటుందని, శరీరం సరిగా పని చేయాలంటే ప్రతి కణానికి అవయవానికి సరిపడా నీరు అందాలని నిపుణులు చెబుతున్నారు. వయోజనులు 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. మహిళలు 2.7 లీటర్లు, పురుషులు 3.7 లీటర్ల నీటిని తాగాలని అమెరికా నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ నిర్దేశించింది. సాధారణ ఆరోగ్య పరిస్థితి ఉన్న వ్యక్తులు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతున్నారు.