యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మధురానగర్ లో పీఎం వాణి యోజన వైఫై సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. యువత స్వయంకృషితో పైకి రావాలని, ప్రభుత్వ ఉద్యోగాలే అని కాదు ప్రైవేటు రంగంలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు.