జూరాల ప్రాజెక్టు కింద వున్న ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయాలని బుధవారం ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ధర్నా చేశారు. కోత దశలో వున్న వరి పంట నీరు లేక ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని కోరారు.