ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Dec 05, 2024, 07:12 IST/

అల్లు అర్జున్ స్పందించి ఆదుకోవాలి: రేవతి భర్త (వీడియో)

Dec 05, 2024, 07:12 IST
పుష్ప-2 మూవీ విడుదల సందర్బంగా HYD ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ.. 'మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్. వాడి కోసమే సినిమాకి వచ్చాము. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగి తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి మా కుటుంబానికి అండగా ఉండాలని, సంధ్య థియేటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.