జిల్లాలో లే అవుట్లకు అనుమతులు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ లేఔట్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. లే అవుట్ల అనుమతుల జారీ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మక్తల్ మండలానికి సంబంధించి రెండు లే అవుట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై సంబంధిత అధికారుల అభ్యంతరాలు తెలిపారు.