కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

71చూసినవారు
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండల ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్