పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆత్మకూరు, ఆమరచింత మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందించారు. అనంతరం మాట్లాడుతూ. లబ్ధిదారులు డబ్బులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తల్లితండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.