ఇతర రాష్ట్రాల నుంచి వరి ధాన్యం తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నవీద్ అన్నారు. కృష్ణ మండలం కృష్ణ నది బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తనిఖీ చేశారు. వాహనాల వివరాలు నమోదు చేసుకున్న రికార్డును పరిశీలించారు. వరి ధాన్యం రాకుండా అడ్డుకోవాలని సూచించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన అనంతరం అనుమతించాలని చెప్పారు.