మాగనూరు: మందుబాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

68చూసినవారు
మాగనూరు: మందుబాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక
మాగనూరు మండలం కొత్తపల్లిలో రైతులు సమావేశాల కోసం నిర్మించిన రైతు వేదిక మందుబాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం అయిందంటే చాలు మందుబాబులు మద్యం సీసాలతో రైతుక వేదిక వద్ద హల్‌చల్‌ చేస్తున్నారు. మద్యం మత్తులో సీసాలను పగలగొట్టి రైతు వేదికలో పారవేస్తున్నారు. పర్యవేక్షణ లోపం వల్ల ఆకతాయిలకు అడ్డాగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి మందుబాబులపై చర్యలు తీసుకోవాలని గురువారం స్థానికులు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్