
మరో లేఖను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరోలేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను రాశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, మోదీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని రాసుకొచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ఆపరేషన్ కగార్‌ను ఆపడానికి ముందుకు రావాలని కోరారు.