మక్తల్: ఈటెల రాజేందర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

83చూసినవారు
రాజకీయ విమర్శలు హుందాతనంగా ఉండాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను ఉద్దేశించి అన్నారు. గురువారం హైద్రాబాద్ లో గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్