మహబూబ్ నగర్ పట్టణంలో ఈనెల 30న నిర్వహించే రైతు పండుగకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రైతుల రుణాలు మాఫీ చేశామని, త్వరలో రైతు బందు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రుణాల మాఫీకి సంబంధించి ఏక్కడ చర్చకు రావాలన్న సిద్ధంగా వున్నానని ప్రతిపక్ష నేతలను ఎమ్మెల్యే సూచించారు.