మక్తల్ మండలం సంగంబండ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాధ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2320 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.