సుప్రసిద్ధ పడమటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన భూములు చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుందని కొత్తకోట శివానంద స్వామి అన్నారు. మక్తల్ పట్టణంలో శనివారం సాయంత్రం జరిగిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గుణాలకు, యాగాలకు నిలయమైన ఈ ప్రాంతంలో జన్మించిన వారు అదృష్టవంతులని అన్నారు. 54 ఎకరాల భూమిలో కేవలం 8 ఎకరాలు మాత్రమే మిగిలిందని అన్నారు.