మక్తల్ మండలం భూత్పూర్, నర్వ మండలంలోని సిపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన వరి ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అని చెప్పారు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.