మక్తల్: బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
మక్తల్ మండలం కర్ని గ్రామంలో సోమవారం జరిగిన బీరప్ప బండారు ఉత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుర్వ కులస్తులపై బండారు (పసుపు) చల్లి ఆశీర్వదించారు. తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుర్వ కులస్తుల ఆరాధ్య దైవం బీరప్ప బండారు ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా వుందని అన్నారు. కుర్వ కుల పెద్దలు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్