మక్తల్: అవగాహన కర పత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే

58చూసినవారు
తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ లోని తన నివాసంలో విడుదల చేశారు. అనంతరం మంటలు ఆర్పేందుకు కొత్తగా తీసుకొచ్చిన పరికరాలను పరిశీలించారు. వాటి పనితీరును అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో ఫైర్ అధికారి నరేష్ గౌడ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్