హైద్రాబాద్ లోని బోయినపల్లి గాంధీ ఐడియాలజీ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కుల గణన అవగాహన సదస్సులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన పై అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులతో సమావేశమయ్యారు. కుల గణన పై ఎమ్మెల్యే అభిప్రాయం తెలిపారు.