మక్తల్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సంగంబండ ప్రభుత్వ పాఠశాలలో పని చేసిన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు దంపతులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. శేష జీవితమంతా సభ్యులతో ఆనందంగా గడపాలని కోరారు. పాఠశాలకు, విద్యాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.