మంత్రి అయిన శుభ సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తనను పుస్తకాలు, పూల కుండీలు, పెన్నులతో మాత్రమే కలవాలన్నారు. శాలువలు పూల బొకేలతో వృథా ఖర్చులు చేయకుండా సన్మానానికి వచ్చేవారు వాటిని తీసుకురావాలని రావాలని పిలుపునిచ్చారు. దీంతో నాయకులు ఆ విధంగా మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.