మక్తల్: అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి

83చూసినవారు
అంబేడ్కర్ ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహిళల హక్కుల కోసం పోరాటం చేశారని అన్నారు. అందరికీ సమాన హక్కులు వుండాలని దూరదృష్టితో ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్