చెల్లి పేరుతో అక్క ఘరానా మోసం.. ట్విస్ట్ ఏంటంటే?
చెల్లి పేరుతో అక్క ఘరానా మోసానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో చోటు చేసుకుంది. లావణ్య అనే మహిళ తన చెల్లెలు ప్రియాంక ఫోటోతో ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేసి.. హైదరాబాద్కు చెందిన సాయిలును తన వలలో పడేలా చేసుకుంది. అతని నుంచి ఏకంగా రూ.కోటి 20 లక్షలు వసూలు చేసింది. మోసపోయిన సాయిలు పోలీసులు ఫిర్యాదు చేశాడు. 2 రోజులుగా పీఎస్లోనే పంచాయితీ జరుగుతోంది. అయితే సాయిలును బెదిరించేందుకు లావణ్య తాజాగా ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు చెబుతున్నారు.