మక్తల్ పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నూతన క్యాంపు కార్యాలయాన్ని పూజలు చేసి ప్రారంభించారు. గత ప్రభుత్వం కట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కోర్టు ఏర్పాటుకు అప్పగించామని, దీంతో క్యాంపు కార్యాలయాన్ని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లోకి మార్చమని ఎమ్మెల్యే చెప్పారు. కోర్టు ఏర్పాటు అత్యవసరం కాబట్టి క్యాంపు ఆఫీస్ ను జ్యుడీషియల్ అధికారులకు అప్పగించామని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.