మక్తల్ పట్టణంలోని సత్యసాయిబాబా ఆలయ ప్రాంగణంలో శనివారం ఎమ్మెల్యే సతీమణి లలిత ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బహుమతులు అందించారు. వివిధ రకాల రంగులతో వేసిన ముగ్గులు అందంగా వున్నాయని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగ విశిష్టత ఉట్టిపడే విధంగా ముగ్గులు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.