ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్
ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. ఇటీవల రామ్ చరణ్.. బాలయ్య హోస్ట్‌గా నిర్వహించే అన్‌స్టాపబుల్ సీజన్-4లో సందడి చేశారు. బాలయ్యతో కలిసి రామ్ చరణ్ అనేక విషయాలు పంచుకున్నారు. ప్రభాస్‌తో ఫోన్ సంభాషణ ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన అమ్మాయినని రామ్ చరణ్ చెప్పి చెప్పనట్టు చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.