వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం రాయినిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా వీరుడు, రాబిన్ హుడ్ పండుగ సాయన్న విగ్రహాన్ని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాలకు పండుగ సాయన్న చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం ముదిరాజ్, ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.