పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

72చూసినవారు
పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆయన నర్వ మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేదని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్