ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లను శనివారం మరికల్ పోలీసులు పట్టుకున్నారు. మక్తల్ కు చెందిన రెండు ఇసుక టిప్పర్లు ఇటుక బట్టీలకు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా సమాచారం మేరకు మరికల్ పోలీసులు పట్టుకొని టిప్పర్ ఓనర్లు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు మరికల్ ఎస్ఐ రాము తెలిపారు.