మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాలకు ఉట్కూర్ మండలంలోని చెరువులు నిండి మత్తడిపోస్తున్నాయి. పెద్దజట్రం గ్రామ చెరువు నిండుకుండలా మారి అలుగు పారుతుంది. చెరువు పూర్తిస్థాయిలో నిండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు నీటితో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని, పంటలు సమృద్ధిగా పెరుగుతాయని అంటున్నారు. చెరువును చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.