ఉట్కూర్ మండలం పెద్ద జట్రం గ్రామ అవ్వ చెరువు యొక్క తూము మరియు అలుగు వద్ద మరమ్మతులు చేపట్టాలని గురువారం మాజీ ఎంపిటిసి సభ్యులు కిరణ్ కుమార్ రైతులు కలిసి తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. వర్షాలకు చెరువు నిండి అలుగు పారుతోందని, తూము వద్ద నీరు వెళ్తోందని చెప్పారు. వాటికి మరమ్మత్తులు చేపట్టాలని తహసీల్దార్ ను కిరణ్ కుమార్ కోరారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ తెలిపారు