ఉట్కూర్ మండలం పగిడిమర్రి గ్రామంలో శనివారం ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు చేశారు. ఉత్సవమూర్తికి పూజలు చేసి రథం పై వుంచి రథోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామం తోపాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.