ఉట్కూర్: మత పెద్దలతో శాంతి సమావేశం

82చూసినవారు
ఉట్కూర్: మత పెద్దలతో శాంతి సమావేశం
పండుగలు అన్ని మతాల వారు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ రామ్ లాల్ అన్నారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని గురువారం ఉట్కూర్ పోలీస్ స్టేషన్ లో ముస్లిం మత పెద్దలు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులతో శాంతి సమావేశం నిర్వహించారు. పండుగ రోజు గోవులను వధించరాదని సూచించారు. గోవులను వధిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. గోవుల అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్