అయ్యోద్య రామ మందిర నిర్మాణం చేపట్టి నేటికీ ఏడాది పూర్తయిన సందర్భంగా మరికల్ విశ్వాహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే గిరి ప్రదక్షణ కార్యక్రమానికి నాయకులు, భక్తులు బయలుదేరి వెళ్ళారు. ప్రదక్షణ అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కార్యక్రమంలో విశ్వాహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు, భక్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.