
INTER RESULTS: ఆ కాలేజీలో అందరూ ఫెయిల్
AP: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. అయితే కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 33 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల్లో అందరూ ఫెయిల్ అయినట్లు కాలేజీ ప్రిన్సిపల్ ఖాజా పర్వీన్ తెలిపారు. సెకండియర్లో 14 మంది పరీక్షలు రాయగా.. ఇద్దరు మాత్రమే పాసయ్యారని వెల్లడించారు.