నాగర్ కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్రం ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందాలన్న దృఢ సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రచించి, దళిత గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేసిన దార్శనికుడిగా అబివర్ణించారు.