నిర్దేశిత లక్ష్యాలను బ్యాంకర్లు చేరుకోవాలి: కలెక్టర్

51చూసినవారు
నిర్దేశిత లక్ష్యాలను బ్యాంకర్లు చేరుకోవాలి: కలెక్టర్
బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో శుక్రవారం బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ ఏడాదిలో పీఎంఈజీపీ కింద యూనిట్లను స్థాపించడానికి అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు వ్యక్తిగత, సంఘం ద్వారా నిర్వహించే కార్యకలాపాలకు బ్యాంకులు రుణాలు అధికంగా ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్