బిజినేపల్లి మండలం వట్టెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా టీకాల అధికారి డాక్టర్ కే రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. చిన్నపిల్లలకు ప్రభుత్వం సూచించిన 12 రకాల టీకాలను తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు. తల్లిదండ్రులకు టీకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ తామర, ఆరోగ్య కార్యకర్త మీనా కుమారి పాల్గొన్నారు.