నాగర్ కర్నూల్ లో ఘనంగా బాలల దినోత్సవం

74చూసినవారు
దేశంలో బాలలకు పలు హక్కులు ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బాలల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఉచిత న్యాయ సేవల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించి ఉచిత న్యాయ సేవలను పొందాలన్నారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో తాము పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్