గిరిజన ప్రాంతాల్లో 108 బైక్ అంబులెన్స్ సేవలు
తమిళనాడులోని మారుమూల ప్రాంతాలకు బైక్ అంబులెన్స్‌లను ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కొండ ప్రాంతాలు, రహదారులు సరిగా లేని గిరిజన గ్రామాల్లో వైద్య సేవలందించేందుకు 108 బైక్ అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. 10 జిల్లాల్లో 58 గ్రామాలకు 25 అంబులెన్స్‌లను పంపింది. వీటిని ఆరోగ్య శాఖ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించింది. GPS ద్వారా అవి వెళ్లే దారిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చే వీలుంది.