నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిగేటట్లు చూడాలని వైద్యులకు సూచించారు. ఒపీని అనుసరించి సరిపడా మందులు అందుబాటులో ఉండేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.